మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో సీబీఐ విచారణకు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి హాజరయ్యారు. హైదరాబాద్‌లోని కేంద్ర దర్యాప్తు సంస్థ కార్యాలయానికి న్యాయవాదులతో కలిసి వచ్చిన అవినాష్‌ను …సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఈ కేసులో అవినాష్ రెడ్డి చుట్టూ సీబీఐ ఇప్పటికే ఉచ్చు బిగించిన విషయం తెలిసిందే. సునీల్ యాదవ్ బెయిలు పిటిషన్ పై వేసిన కౌంటర్ అఫిడవిట్ లో అవినాష్ రెడ్డి పాత్రపై కీలకమైన వ్యాఖ్యలు చేసిన సీబీఐ…మరింత లోతుగా విచారణ చేస్తున్నట్లు సమాచారం.
అటు అవినాష్ విచారణ సందర్భంగా సీబీఐ కార్యాలయానికి వైసీపీ కార్యకర్తలు, ఆయన అనుచరులు భారీగా తరలివచ్చారు. వారిని అడ్డుకున్న పోలీసులు వెంటనే అక్కడి నుంచి పంపించేశారు. ఈ నేపథ్యంలో సీబీఐ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.