నా కుమారుడు రాఘవరెడ్డి ఎటువంటి తప్పు చేయలేదు – ఎంపీ మాగుంట

-

నా కుమారుడు రాఘవరెడ్డి ఎటువంటి తప్పు చేయలేదని వైసీపీ పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన.. మాగుంట రాఘవరెడ్డి కి 10 రోజుల ఈడీ కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతిచ్చింది. ఈడీ కస్టడీని రాఘవ తరపు న్యాయవాది వ్యతిరేకించారు. జ్యుడీషియల్ కస్టడీ కి ఇవ్వాలని కోర్టును అయన వేడుకున్నారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద నిందితులను ఈడీ కస్టడీకి అనుమతించవచ్చని ఈడీ తరపు న్యాయవాది వాదించారు.

ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి నరేష్ కుమార్ లాకా.. మాగుంట రాఘవరెడ్డికి 10 రోజుల ఈడీ కస్టడీకి అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే, ఈ కేసుపై తాజాగా వైసీపీ పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి స్పందించారు. నా కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ఎటువంటి తప్పు చేయలేదు..మా తండ్రి 70 ఏళ్ల నుంచి వ్యాపారం చేస్తున్నారన్నారు. మేము నిబద్దతతో వ్యాపారాలు చేస్తాం.. మా అబ్బాయి ఏ తప్పు చేయలేదని చెప్పాడు..మాగుంట కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేయనని చెప్పాడన్నారు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news