బీహార్ లో మూడవ దశ పోలింగ్ కు ముందు, లోక్తాన్ట్రిక్ జనతా పార్టీ చీఫ్, ఎంపీ చిరాగ్ పాస్వాన్ గురువారం ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు. నవంబర్ 10 న ఫలితాలు ప్రకటించిన తరువాత, రాష్ట్ర జనతాదళ్ చీఫ్ తేజశ్వి ఎదుట సిఎం నితీష్ కుమార్ మోకరిల్లాలి అంటూ విమర్శలు చేసారు. మీరు ప్రధానిని విమర్శించడంలో ఎప్పుడూ ముందు ఉన్నారు.
కానీ ఇప్పుడు ఆయనతో వేదికను పంచుకునే సమయంలో మీరు ఆయనకు నమస్కరించడానికి వెనుకాడరు. ఈ చర్య ద్వారా సిఎం పదవిపై మీకు ఉన్న దురాశను చూపిస్తుంది అంటూ విమర్శించారు. ఎన్నికల ఫలితాల తరువాత, మీరు తేజశ్వి యాదవ్ ముందు వంగి నమస్కారం చేస్తారు అంటూ ఆయన విమర్శలు చేసారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వ పథకాల ఆధారంగా తాను తిరిగి ఎన్నికవుతానని నితీష్ కుమార్ ఆశిస్తున్నాడని, జెడి (యు) పనితీరు ఆధారంగా కాదు అని ఆయన ఎద్దేవా చేసారు.