ఫ్లెక్సీల రాజకీయాలు అపి రైతుల మీద దృష్టి పెట్టాలి : ఎంపీ కోమటిరెడ్డి

-

నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ లో కాంగ్రెస్ కార్యకర్తల ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు ఎక్కడ మాట్లాడిన దేశంలో రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చేది తెలంగాణ ప్రభుత్వం అని చెప్తారు.. కానీ ఇప్పుడు 6 గంటల కరెంట్ కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. అంతేకాకుండా అది కూడా అప్పుడు గంట ఇప్పుడు గంట ఇవ్వడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన మండిపడ్డారు. మొదట రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని.. ఆ నాడు ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రేడ్డి ఉన్నప్పుడు రైతులకు ఉచిత కరెంట్‌ను అందించామన్నారు.

వ్యవసాయ సీజన్ మూసీలో నీటిని విడుదల చేయకుండా మూసీ రిపేర్కు విడుదల చేసిన నిధులను దోచుక తిన్నారని ఆయన ఆరోపించారు. మరో వైపు 50కోట్లుతో బ్రాహ్మణ వెళ్లాం ప్రాజెక్ట్ కి పూర్తి చేయలేదని, నల్గొండ జిల్లాలో ఏం పని చేశారో సీఎం కేసీఆర్ చెప్పాలని ఆయన డిమాండ్‌చేశారు. నీళ్లు ఇవ్వకుండా రైతులను నాశనం చేసి బీజేపీ, టీఆర్ఎస్ వాళ్ళు పనికిరాని ఫ్లెక్సీ ల పంచాయితీ పెట్టుకుంటున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version