ఇక సినిమా చూపిస్తా : జగన్ కు రఘురామ వార్నింగ్‌

-

ఢిల్లీ : మరోసారి వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తాను వేసిన జగన్‌ బెయిల్ రద్దు పిటీషన్ దేశంలోని అందరు రాజకీయ నాయకులకు పంపానని…  వాళ్ళు రకరకాల ప్రశ్నలు అడిగారని తెలిపారు. పిటీషన్‌ ను పంపితే తప్పేంటని… పంపొద్దు అనడానికి నువ్వె ఎవరు అంటూ ఫైర్‌ అయ్యారు. ఇప్పుడు తన ఫోన్ ఎవరి అనుమతి లేకుండా ఓపెన్ చేసినందుకు సినిమా ఎలా ఉంటుందో చూపిస్తానని హెచ్చరించారు. ఎంతో కాలంగా నిందలు వేసి ఇన్ సైడ్‌ ట్రేడింగ్ జరిగింది అని చాలా మంది కారుకుతలు కుశారు… ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెప్పుతారని నిలదీశారు.

ఇన్ సైడ్‌ ట్రేడింగ్ జరిగింది అని బోగస్ ప్రచారం చేశారు దాని పై గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది, సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ను సమర్ధించిందని చురకలు అంటించారు. ప్రత్యేక హోదా అంశం పై సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే రాజీనామాకు ఎంపీలందరం సిద్ధమన్నారు. పోలవరానికికి 55 వేల కోట్లు ఇవ్వండి అని అంటున్నారు.. మన స్టాండ్ క్లియర్ గా ఉండాలని తెలిపారు.

తన పై అనర్హత వేటు పడదని…జగన్‌ బెయిల్ రద్దు చేయమని అనడం రాజద్రోహం కేసు ఎలా అవుతుందని మండిపడ్డారు. ”వాట్సాప్ లో చాటింగ్ బయట పెట్టాము అని అంటున్నారు..నా ఫోన్ పోలీసులు తీసుకున్నారు. నేను ఎవరికి మెస్సేజ్ చేస్తే మీకేంటి..అది రాజద్రోహం కేసు ఎలా అవుతుంది.. పెగసెస్ సాఫ్ట్ వేర్ మీరు తెప్పించారు అని అంటున్నారు. మీరు చాలా మంది పై వాడారు అని అంటున్నారు. దానికి మీరు కేంద్రం అనుమతి తీసుకున్నారా?” అంటూ రఘరామ నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Latest news