ప్రధాని మోడీకి నాగం జనార్దన్ రెడ్డి లేఖ

దేశ ప్రధాని మోడీకి మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి లేఖ రాశారు. జల వివాదం నేపథ్యంలో రెండు రాష్ట్రాలపై మండిపడుతూ.. ప్రధాని మోడీకి నాగం జనార్దన్ రెడ్డి లేఖ రాశారు. సంగమేశ్వర ప్రాజెక్టు నిర్మాణం కోసం మట్టిని కూడా తెలంగాణ నుండే తీసుకెళ్తున్నారని.. తెలంగాణ ప్రభుత్వం కండ్లు మూసుకొని ఉందా..? అని లేఖలో పేర్కొన్నారు.

కృష్ణా జలాలు వాడుకునే హక్కు తెలంగాణ కు మాత్రమే ఉందని.. తెలంగాణ కు ఆంధ్ర నీళ్ల దోపిడీ కనిపించడం లేదా ? అని మండిపడ్డారు నాగం జనార్దన్ రెడ్డి.
కెసిఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని.. తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న సీఎం అవసరమా..? అని ప్రశ్నించారు. రాయలసీమ ప్రాంతం.. నీటి దోపిడీ ఎక్కువైందని.. ఏడు ఏళ్ల లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని నిప్పులు చెరిగారు నాగం జనార్దన్ రెడ్డి. పాలమూరు జిల్లాలో ఎక్కడైనా చిన్న రిజర్వాయర్ అయినా సిఎం కెసిఆర్ కట్టిడా ? అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టుల నుండి నీళ్ళు ఇచ్చి.. నేనే ఇచ్చిన అని గొప్పలు చెప్పుకుంటున్నారని కెసిఆర్ పై ఫైర్ అయ్యారు నాగం జనార్దన్ రెడ్డి.