కొత్త సంవత్సరం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కొత్త ట్విస్ట్ ఇచ్చేలా ఉన్నారు. వైసీపీకి ఆయన గుడ్‌బై చెప్పేలా కనిపిస్తున్నారు. అలాగే ఎంపీ పదవికి రాజీనామా చేసి, ఉపఎన్నిక బరిలో దిగడానికి కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన మాటల బట్టి చూస్తే త్వరలోనే నరసాపురం ఉపఎన్నిక వచ్చేలా ఉంది.
తాజాగా విలేఖర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ…వైసీపీని వదిలేసి ఎంపీ పదవికి రాజీనామా చేస్తారనే విషయానికి సమాధానం ఇస్తూ..తమ పార్టీ బాగు కోసం తాను కష్టపడుతున్నానని, లేని పక్షంలో బయటకు రావొచ్చు అని మాట్లాడారు. త్వరలోనే ఈ విషయాన్ని తేల్చడానికి రఘురామ సిద్ధమైనట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన రఘురామ..అదే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీలో ఉంటూ రచ్చబండ పేరిట…ప్రతిరోజూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.
ఇలా తమపై విమర్శలు చేస్తున్న రఘురామపై వైసీపీ నేతలు కూడా విరుచుకుపడుతున్నారు. ఆయనకు ఎలాగైనా చెక్ పెట్టాలని చూస్తున్నారు. రఘురామపై వేటు వేయించాలని ట్రై చేస్తున్నారు. అలాగే ఆయన్ని ఒకసారి అరెస్ట్ కూడా చేసిన విషయం తెలిసిందే. అయినా సరే రాజుగారు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా వైసీపీపై ఫైర్ అవుతున్నారు. ఈ క్రమలోనే ఆయన తాజాగా వైసీపీకి వీడ్కోలు చెప్పే విషయంలో కాస్త క్లారిటీ ఇచ్చినట్లు కనిపిస్తోంది.
అయితే ఎంపీ పదవికి రాజీనామా చేస్తే..నరసాపురం స్థానానికి ఉపఎన్నిక వస్తుంది. ఆ ఉపఎన్నికలో టీడీపీ-జనసేన మద్ధతు తీసుకుని బరిలో దిగాలని రాజు గారు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ ఓడిపోయింది కేవలం 30 వేల ఓట్ల తేడాతోనే..అలాగే జనసేనకు రెండు లక్షల 50 వేల ఓట్లు వచ్చాయి. అంటే టీడీపీ-జనసేన మద్ధతుతో ఈజీగా గెలవచ్చని రాజుగారి ఆలోచనగా తెలుస్తోంది. చూడాలి మరి రాజుగారు ఎంపీ పదవికి రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళ్తారో లేదో?