ఢిల్లీ : నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని పేర్కొన్న ఆయన..తన లోక్ సభ సభ్యత్వం కూడా రద్దు అవ్వడం కల మాత్రమేనని పేర్కొన్నారు. తాను స్పీకర్ కి వివరణ అందిస్తానని చెప్పారు. తాను పార్టీ ఉల్లంఘనలకు పాల్పడలేదని…
స్పీకర్ పై విజయసాయిరెడ్డి కామెంట్స్ సరికాదని మండిపడ్డారు.
రాజ్యసభ లో సాయిరెడ్డి ప్రధాని ఉండగానే దురుసుగా రాజ్యసభ లో వ్యవహరించినట్టు తెలుస్తుందన్నారు. పోలవరం ,ప్రత్యేక హోదా పై సడెన్ గా సభలో ఆందోళన చేస్తాం అని అంటున్నారు…ఇవ్వన్నీ చిత్తశుద్ధి తో చేస్తే బాగానే ఉంటుందని చురకలు అంటించారు. లోక్ సభ ఆందోళన పై తనకైతే ఆహ్వానం లేదని తెలిపారు. కొత్తగా కార్పొరేషన్ల పదవులు వేశారని…ప్రజల మర్చిపోయిన కులాలను గుర్తు చేసి పదవులు ఇచ్చారని మండిపడ్డారు. ప్రాధాన్యత కలిగిన శాఖలు ఒక సామాజికవర్గానికి మాత్రమే ఇచ్చారు అని అందరూ అంటున్నారని ఎద్దేవా చేశారు. సామాజిక న్యాయం చక్కగా పాటించారు.