ఏపీలోనూ వేల కోట్ల మద్యం కుంభకోణం – రఘురామ సంచలనం

-

ఢిల్లీలో ప్రభుత్వ మద్యం దుకాణాలను ఎత్తివేసి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించగా, ఏపీలో షాపుల ద్వారా మద్యం అమ్మకాలను రాష్ర ప్రభుత్వమే చేపట్టాలని నిర్ణయించిందని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. ఢిల్లీ మద్యం పాలసీకి పూర్తి భిన్నమైన విధానాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టారని, నూతన మద్యం విధానం వల్ల ఢిల్లీలో 100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు లెఫ్టినెంట్ గవర్నర్ గారు కేంద్రానికి లేఖ రాయగా, కేంద్ర ప్రభుత్వం స్పందించి విచారణకు ఆదేశించిందని తెలిపారు.

ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారి శరత్ చంద్రారెడ్డి ఆంధ్రప్రదేశ్ లోను పెద్ద ఎత్తున మద్యం వ్యాపారం చేయడమే కాకుండా ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ అనే చిలిపి మద్యం బ్రాండ్లను సృష్టించి రాష్ట్ర ప్రభుత్వానికి సరఫరా చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వమే తాను నిర్వహిస్తున్న మద్యం దుకాణాలలో ఈ బ్రాండ్లను విక్రయిస్తోందని, ఎన్నికలకు ముందు మధ్య నిషేధం అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో మద్య నిషేధం అమలు చేయకపోతే మళ్లీ రానున్న ఎన్నికల్లో ఓట్లు అడగమని ప్రజలకు చెప్పారని గుర్తు చేశారు. అయినా భవిష్యత్తులో అమ్మబోయే మద్యంపై కూడా ఇప్పటికే 30 వేల కోట్ల రూపాయలను జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పుగా తీసుకుందన్నారు.

ఇక రాష్ట్రంలోని మెజార్టీ డిస్టలరీలను లీజుకు తీసుకున్న శరత్ చంద్రారెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి 1200 కోట్ల రూపాయల విలువ చేసే మధ్యమును సరఫరా చేస్తున్నారని, రాష్ట్రంలో రోజుకు 70 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని, ఈ లెక్కన ఏడాదికి 24 నుంచి 25 వేల కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని అన్నారు. మద్యం సరఫరాదారు నుంచి కొనుగోలులో పది నుంచి పదిహేను శాతం మొత్తం పాలకుల జేబుల్లోకి వెళుతున్నట్లు ప్రజలు అనుమానిస్తున్నారని, ఉదాహరణకు సరఫరాదారుని వద్ద నుంచి 20 నుంచి 30 రూపాయలకు సీసా మద్యం కొనుగోలు చేసి, ప్రభుత్వ మద్యం దుకాణాలలో దాన్ని 200 రూపాయలకు విక్రయిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని డిస్టలరీలు కేవలం ముగ్గురు నలుగురు అస్మదీయుల చేతుల్లోనే ఉన్నాయని వారికి ప్రభుత్వం పెద్ద రేట్లను ఇచ్చి మద్యం కొనుగోలు చేస్తోందని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. రాష్ట్రంలో ప్రముఖ బ్రాండ్లు కేవలం మద్యం దుకాణాలలో ప్రదర్శనకే పరిమితమయ్యాయని చివరకు తమ పార్టీ ఎంపీకి చెందిన మద్యం బ్రాండ్ మెక్ డవల్ కూడా రాష్ట్రంలో మద్యపాన ప్రియులకు అందుబాటులో లేదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news