సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ పై ఎంపీ శశిథరూర్ కీలక వ్యాఖ్యలు

-

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రివాల్ అరెస్ట్ పై కాంగ్రెస్ నేత, ఎంపీ శశిథరూర్ స్పందించారు. సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ ఘటన ను న్యాయస్థానం సుమోటోగా స్వీకరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలపై ప్రభావం చూపే అంశంపై చర్యలు తీసుకునే హక్కు కోర్టుకు ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేజ్రీవాల్ అరెస్ట్ జరిగిందని ఆరోపించారు. కేజ్రీవాల్ అరెస్ట్న పౌరుల రాజకీయ హక్కుల ఉల్లంఘనగా భావించాలన్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం కేజ్రివాల్ ఇంట్లో ఈడీ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. దాదాపు నాలుగు గంటల పాటు సీఎం ఇంట్లో తనిఖీలు చేసిన అధికారులు అనంతరం ఆయనను అరెస్ట్ చేశారు. కేజ్రీవాల్ ని అదుపులోకి తీసుకుని నేరుగా ఈడీ కార్యాలయానికి తరలించారు. ఆయనను రాత్రంతా ఈడీ హెడ్ ఆఫీస్ లోనే ఉంచారు. శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్నారు. సీఎం కేజ్రివాల్ అరెస్ట్ ని నిరసిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలనకు పిలుపునిచ్చింది. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా అధికారులు అలర్ట్ అయ్యారు. దేశ రాజధానిలో భారీగా భద్రత పెంచారు. ఆప్ ఆందోళనలకు పిలుపునివ్వడంతో ఢిల్లీలో హై టెన్షన్ వాతావారణం నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news