త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ?

Join Our Community
follow manalokam on social media

మున్సిపల్ ఎన్నికలు పూర్తి అయిన  వెంటనే జడ్పీటీసీ, ఎమ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే దిశగా ఎస్ఈసీ అడుగులు వేస్తున్నట్టు చెబుతున్నారు. జడ్పీటీసీ, ఎమ్పీటీసీ ఎన్నికల పై ఇప్పటికే ఎస్ఈసీ కసరత్తు ప్రారంభించినట్టు చెబుతున్నారు. ఆగిన చోటు నుంచే ఎన్నికలు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిన సంగతి తెలిసిందే. అయితే ఇతర పక్షాల నుంచి పలు ఫిర్యాదులు వచ్చాయని ఎస్ఈసీ పేర్కొంది.

ఈ నేపథ్యంలో ఇటువంటి ఫిర్యాదులను పరిశీలించి నివేదికలు ఇవ్వాల్సిందిగా జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు ఎస్ఈసీ ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ నెల 20వ తేదీ లోపు బలవంతపు ఏకగ్రీవాలు, ఇతర ఫిర్యాదుల పై నివేదికలు ఇవ్వాలని ఎస్ఈసీ ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే మొత్తం మూడు ఆప్షన్స్ ని ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది. మరి ఏ నిర్ణయానికి వస్తుంది అనేది కాలమే నిర్ణయించాలి మరి.

TOP STORIES

రూపాయి ఫీజు.. రిటైర్డ్ టీచర్ క్లాస్..!

రిటైర్‌మెంట్ తీసుకున్న ఉద్యోగులు వృద్ధాప్య జీవితాన్ని ఏదోఒక కాలక్షేపంతో కానిచ్చేస్తుంటారు. మనవళ్లకు ఆటపాటలు నేర్పిస్తూ కాలం గడుపుతుంటారు. కానీ బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన 61ఏళ్ల లోకేశ్...