ఐపీఎల్ విజేత గా చెన్నై సూపర్ కింగ్స్ రికార్డు సృష్టించింది. వరుసగా నాలుగో సారి ఐపీఎల్ విజేత గా నిలిచింది చెన్నై. నిన్న జరిగిన ఐపిఎల్ 2021 ఫైనల్ లో కోల్కత్త నైట్ రైడర్స్ పై ఘన విజయం సాధించింది. 27 పరుగుల తేడాతో కేకేఆర్ జట్టు పై చెన్నై విజయం సాధించింది. దీంతో.. చెన్నై సూపర్ కింగ్స్ తన ఖాతాలో నాలుగో టోర్నీ ని వేసుకుంది. ఇది ఇలా ఉండగా.. ఐపీఎల్ టోర్నీ గెలవడం పై… చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ ఆసక్తిగా కామెంట్ చేశారు.
తాను ఇప్పుడు చెన్నై గురించి మాట్లాడే ముందు కోల్కతా నైట్ రైడర్స్ గురించి చెప్పాలని… మ్యాచ్ అనంతరం ఆ జట్టు పై ప్రశంసల వర్షం కురిపించారు ధోని. ఇండియాలో జరిగిన మొదటి భాగం తర్వాత ఆ జట్టు ఇంత గొప్పగా పుంజుకోవడం.. చాలా కష్టమైన పని. ఈ సీజన్ లో ఎవరైనా విజేతగా నిలవాలంటే అది కోల్ కతా నైట్ రైడర్స్ మాత్రమేనని కుండబద్దలు కొట్టారు మహేంద్రసింగ్ ధోని.
వాళ్లకు మధ్యలో దొరికిన విరామం కలిసి వచ్చిందని అనుకుంటున్నానని.. చాలా బాగా ఆడారని పేర్కొన్నారు. ఇక చెన్నై గురించి మాట్లాడితే.. అందరూ ఆటగాళ్లు అద్భుతంగా రాణించాలని చెప్పుకొచ్చారు. అందరు ఆటగాళ్లు ఆడితేనే ఈ టోర్నీ గెలిచాం… ఏ ఒక్కరు ఆడకపోయినా ఈ కష్టమైన పని అని వెల్లడించారు.