తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన …మత్స్య కారులు హెచ్చరిక..!

తెలుగు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బ౦గాళాఖాతంలో ఉత్తరాంధ్ర , దక్షిణ ఒడిషా తీరం మధ్య అల్పపీడనం కొనసాగుతుంది. దాని ప్రభావం తో ఒడిషా మరియు రెండు తెలుగు రాష్ట్రాలలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అంతే కాకుండా వర్షాల నేపథ్యం లో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మొదటి నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. తరచూ వర్షాలతో హైదరాబాద్ ప్రజలు కూడా ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. వర్షాలతో ట్రాఫిక్ జామ్ లు లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరటం తో ఆందోళన చెందుతున్నారు.