నేటి కాలం లో పంట భూములు తగ్గడమే కాదు పంటల్ని పండించే రైతులు కూడా తగ్గిపోతున్నారు. ఈ మాట పక్కన పెడితే స్వచ్ఛంగా పండించే పంటలు కూడా కనుమరుగైపోయాయి. మెచ్చుకోదగ్గ విషయం ఏమిటంటే ఎన్నో విజయాలు అందుకున్న ధోని అంతర్జాతీయ క్రికెక్ట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పి ఇప్పుడు వ్యవసాయం లో బాగా బిజీ అయ్యాడు. రాంచీ శివార్ల లోని శంబో గ్రామం లోని ధోని 43 ఎకరాల ఫామ్ హౌస్‌లో 10 ఎకరాల్లో టమోటా, క్యాబేజీ, బొప్పాయి, ఇతర పంటలను పండిస్తున్నాడు. ఆర్గానిక్ పద్దతి లో పండిస్తున్న ధోనీ ఫామ్ కూరగాయలకు స్థానికంగా మంచి డిమాండ్ ఉన్నట్టు తెలుస్తోంది.
తన సమయాన్ని మహీ సేంద్రియ వ్యవసాయం చేయడానికి కేటాయిస్తున్నారు. ఇప్పుడే కాదు గతం లో కూడా ధోని వ్యవసాయం చేసినట్టు వార్తలు కూడా వచ్చాయి. ఇది ఇలా ఉండగా ధోనీ ఫామ్ లో పండిన కూరగాయలను దుబాయ్‌కు ఎగుమతి చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే వీటిని గల్ఫ్ లో మార్కెట్ చేసేందుకు ఫామ్ ఫ్రెష్ ఏజెన్సీ తో జార్ఖండ్ వ్యవసాయ శాఖ సంప్రదింపులు జరుపుతోంది. ఇప్పటికి ఇంకా ఈ ఒప్పందం కుదరకపోయిన త్వరలో ఒప్పందం కూడా అయ్యేలా తెలుస్తోంది.
ధోని పేరిట కూరగాయలను విదేశాలకు పంపించడం వల్ల జార్ఖండ్ రైతులకు కూడా ప్రయోజనం కలుగుతుంది అని రాంచీ మార్కెటింగ్ కమిటీ అధిపతి అభిషేక్ ఆనంద్ తెలిపారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలివుడ్ హీరోలు తమ ఫాం హౌస్‌ల్లో సేంద్రియా వ్యవసాయం చేస్తున్నారు. ఏది ఏమైనా ఇలా పండించడం ఎంతో మందికి స్ఫూర్తిని ఇస్తుంది. ఇలా ప్రతీ ఒక్కరు ఆదర్శంగా తీసుకుని ముందడుగు వేస్తే ఆర్గానిక్ ఆహారం పండించొచ్చు… ఆరోగ్యంగా ఉండొచ్చు.