మా హయాంలో MSME వృద్ధి 11 నుంచి 15 శాతం పెరిగింది..కేటీఆర్ మరో ట్వీట్

-

చిన్న,మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా MSME పాలసీ-2024ను ప్రకటించిన విషయం తెలిసిందే. సమగ్ర అధ్యయనంతో ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.ఈ క్రమంలోనే మాజీ మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ హయాంలో ఎంఎస్ఎంఈ పాలసీ సాధించిన పారిశ్రామిక వృద్ధిపై ‘X’ ఖాతాలో ట్వీట్ చేశారు. గతంలో కేసీఆర్ పరుగులు పెట్టిన పారిశ్రామిక ప్రగతిని కాంగ్రెస్ అధికారికంగా ఒప్పుకుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

గత పదేళ్లలో సూక్ష్మ, చిన్న,మధ్య తరహా పరిశ్రమల వృద్ధి రేటు 11 శాతం నుంచి 15 శాతం పెరిగిందని గుర్తుచేశారు. 2018-2023 మధ్యలో టీఎస్ ఐపాస్ ద్వారా పెరిగిన సగటు పెట్టుబడి 115 శాతంగా ఉందన్నారు. ఇక జీఎస్డీపీలో ఎంఎస్ఎంఈల వాటా వృద్ధి 10 శాతంగా ఉందని, ప్రతిఏటా పెరిగిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సంఖ్య 15 శాతం అని చెప్పారు. ఎంఎస్ఎంఈల్లో పెరిగిన ఉపాధి 20 శాతం వృద్ధి రేటు ఉందని తెలిపారు.

ఎంఎస్ఎంఈల్లో 30 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ మహిళలు ఉద్యోగాలను పొందారని, 2020-2023 మధ్యలో అతి తక్కువ ఎంఎస్ఎంఈలు మూసిపడిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్ ఐపాస్ ప్రగతిశీల విధానాలు చిన్న పరిశ్రమలకు ఇచ్చిన ప్రోత్సాహకాలతోనే అద్భుత ప్రగతి సాధించామని పేర్కొన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news