ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయా..? అయితే ఇది తప్పక చూడాల్సిందే..!

-

బ్యాంకుల్లో డబ్బులు దాచుకోవడం, లోన్ తీసుకోవడం మొదలు అకౌంట్ వలన ఎన్నో లాభాలు వున్నాయి. అయితే చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉంటూంటాయి. మీకు కూడా ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయా..? అయితే దీన్ని తప్పక చూడాలి. అన్ని బ్యాంకులు ఒకేలా సేవలని ఇవ్వరు. వివిధ బ్యాంకులు వివిధ రకాల బెనిఫిట్స్‌ ని అందిస్తూ ఉంటాయి.

అలానే బ్యాంకులు క్రెడిట్ కార్డులు, లోన్లు, లాకర్లు మొదలైన ఫెసిలిటీస్ ని ఇస్తున్నాయి. ఇవి కూడా బ్యాంకులన్ని బట్టీ మారుతూ ఉంటాయి. ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే ఎక్కువగా నష్ట పోవాల్సి ఉంటుంది. ప్రతీ అకౌంట్ లో కూడా కొంత బ్యాలెన్స్ ఉంచాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక అమౌంట్ ని ఉంచకపోతే నాన్ మెయింటెనెన్స్ ఛార్జీల రూపం లో పెద్ద మొత్తం లో ఛార్జీలు విధిస్తుంటాయి.

అయితే ఎక్కువ అకౌంట్ ఉంటే ఈ బ్యాలెన్స్ ని మైంటైన్ చేయడం కష్టం. శాలరీ అకౌంట్లను ఓపెన్ చెయ్యాల్సి వస్తే వాటిల్లో జీరో బ్యాలెన్స్‌తోనే ఉంటాయి. కానీ అలాంటి వాటి వల్ల ప్రయోజనం ఏమి ఎక్కువ ఉండదు. ఎక్కువ బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేయకుండా తక్కువ ఛార్జీలు విధించే బ్యాంకుల నుండి..,ఉత్తమ ప్రయోజనాలు పొందే బ్యాంక్ అకౌంట్లను ఉంచుకోవడం మంచిది. పైగా ఎన్ని అకౌంట్స్ ఉంటే అన్ని వాటికి వార్షిక ఫీజు ని పే చేయాల్సి వుంది. ఎటిఎం ఛార్జీలు, ట్రాన్సాక్షన్ ఛార్జీలు కూడా పడతాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news