ఈ రోజు మహిళపై జరిగిన ఒక అత్యాచార ప్రయతనంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన ములుగు ఎమ్మెల్యే స్పందించడం జరిగింది. ఈమె మాట్లాడుతూ నడిరోడ్డుపై స్త్రీకి నడిచే హక్కు లేదా అంటూ ఈ BRS ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. హైదరాబాద్ జవహర్ నగర్ లో ఒక అమ్మాయిపై బట్టలు విప్పించి దాడి చేసిన ఘటనపై సీతక్క ఫైర్ అయ్యారు. ఈ ఘటనలో ఇబ్బంది పడిన బాధితురాణిలు కలిసి మాట్లాడిన సీతక్క ప్రభుత్వాన్ని అడిగింది. ఈ ప్రభుత్వం లోనికి మంత్రి మల్లారెడ్డి నియోజకవర్గం అయిన మేడ్చల్ పరిధిలో ఇంత దారుణం జరిగినా ఇప్పటి వరకు ప్రభుత్వం ఏ విధంగానూ స్పందించకపోవడం చాలా బాధాకరం అంటూ బాధపడింది సీతక్క. ఈ బాధితురాలి బాధను పట్టించుకుని ప్రభుత్వం స్పందించి నేరస్థుడ్ని శిక్షించాలి అంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని గట్టిగా మాట్లాడింది సీతక్క. మరి ప్రభుత్వం ఏమైనా స్పందించి ఆ మహిళలు న్యాయం చేస్తుందా అన్నది తెలియాల్సి ఉంది.