డ్రగ్స్ కేసు: నేడు ఈడీ ముందుకు హాజరు కానున్న ముమైత్ ఖాన్

తెలుగు చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ కేసు కలకలం రేపుతుంది. ఈడీ ముందుకు ఒక్కొక్కరుగా హాజరవుతూ వస్తున్నారు. నోటీసులు అందిన వారిలో పూరీ జగన్నాథ్, ఛార్మి, నవదీప్ ఈడీ ఎదుట హాజరయ్యారు. ప్రస్తుతం నేడు ముమైత్ ఖాన్ ఈడీ ఎదుట హాజరు కానుంది. డ్రగ్ డీలర్ కెల్విన్ తో కలిసి ముమైత్ ఖాన్ ని ప్రశ్నించనున్నారని తెలుస్తుంది. మనీ లాండరింగ్ వ్యవహారాల కోణంలో విచారణ కొనసాగనుంది. ముమైతే నుండి పెద్ద మొత్తంలో డబ్బు కెల్విన్ కి బదిలీ అయినట్లు ఆరోపిస్తున్నారు.

మరి విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో చూడాలి. మొన్నటికి మొన్న నవదీప్ ని విచారించారు. మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఎదుట హాజరయిన ఛార్మి బ్యాంకు స్టేట్మెంట్లను పరిశీలించారు. అలాగే నవదీప్ బ్యాంకు లావాదేవీలపై ఆరా తీసారు. ఇప్పుడు ముమైత్ ఖాన్ ని ప్రశ్నించనున్నారు. మరి ఈ డ్రగ్స్ కేసు ఎప్పటికి కొలిక్కి వస్తుందో చూడాలి. ఈడీ నుండి నోటీసులు అందిన వారు హాజరు కావాల్సిన వారు ఇంకా ఉన్నారు.