నీట్ ఎగ్జామ్: ఒకరి స్థానంలో మరొకరు.. బయటకు వచ్చిన బడా ముఠా.. అరెస్టు చేసిన పోలీసులు

వారణాసిలోని సారనాథ్ ప్రాంతంలో సెయింట్ జేవియర్ పరీక్షా కేంద్రంలో తల్లీ కూతుళ్ళను పోలీసులు అరెస్టు చేసారు. సాల్వర్ గ్యాంగ్ లో భాగమైన తల్లీకూతుళ్ళను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేసారు. ఈ సాల్వర్ గ్యాంగ్ లో ప్రముఖ విశ్వవిద్యాలయాల నుండి విద్యార్థులు సహా పేరున్న వైద్యులు కూడా ఉన్నారు. ఈ సాల్వర్ గ్యాంగ్ ఉత్తరప్రదేశ్ లోనే కాదు బీహార్ నుండి కూడా ఆపరేట్ అవుతుంది.

up police

 

గత ఆదివారం రోజున జూలీ అనే విద్యార్థినిని పోలీసులు అరెస్టు చేసారు. బీడీఎస్ స్టూడెంట్ అయిన జూలీతో పాటు ఆమె తల్లి బబితా కూడా అరెస్టు అయ్యింది. విచారణలో తేలిన సమాచారం ప్రకారం బబితా కుమారికి 5లక్షల రూపాయలు అందాయి. హన్శా నివాస్ స్థానంలో జూలీని పరీక్షకు పంపినందుకు సాల్వర్ గ్యాంగ్ నుండి 5లక్షల రూపాయలు బబితాకు అందాయి.

ఈ విషయంలో మరింత కనుక్కున్న పోలీసులకు కళ్ళు బైరులు కమ్మే నిజాలు తెలుసుకున్నారు. ఈ సాల్వర్ గ్యాంగ్ లో మూడు బృందాలు ఉన్నాయి.

ఇందులో ఒక బృందం గత సంవత్సరాలలో నీట్ ఎగ్జామ్ ఎవరెవరు పాసయ్యారనేది చూసుకుంటుంది. అందులో ఎంత మంది పేదలు ఉన్నారనేది చెక్ చేస్తుంది. జూలీ తండ్రి ఒక కూరగాయల వ్యాపారి. రెండు సంవత్సరాల క్రితం నీట్ ఎగ్జామ్ లో 520మార్కులు తెచ్చుకుంది.

ఇక మరొక బృందం, ఎవరైతే నీట్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యారో చూసుకుంటుంది. వాళ్ళు డబ్బులు చెల్లించే విధంగా ఉన్నారా లేదా అనేది తెలుసుకుంటుంది. ఆ తర్వాత మరో బృందం, డీల్స్ చేస్తుంది. ఎవరికి బదులు ఎవరు ఎగ్జామ్ కి వెళ్ళాలనేది చూసుకుంటుంది.

ఈ సాల్వర్ గ్యాంగ్ 20-25లక్షల రూపాయలను నీట్ ఎగ్జామ్ కి రాయకుండా పాస్ కావాలనే వ్యక్తి నుండి తీసుకుంటుంది. అందులో కేవలం 5లక్షలు మాత్రం అడ్వాన్స్ గా తీసుకుని, బదులుగా రాసే వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఈ మొత్తం వ్యవహారం వెనక ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి ఉన్నట్లు పోలీసులు కనుక్కున్నారు.

ఈ ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి, విద్యార్థులతో సంభాషించడానికి ఫోన్ వాడడు. ఉత్తరాల ద్వారా మాత్రమే కథ నడిపిస్తాడు. ప్రస్తుతానికి ఈ కేసులో నలుగురు అరెస్టు అయ్యారు.