ఢిల్లీపై ముంబై విజయం.. ప్లే ఆఫ్స్‌కు చేరిన ఆర్‌సీబీ

ఐపీఎల్‌ సీజన్‌ 2022లో జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. అయితే ఈ సీజన్‌ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌ నిష్క్రమించింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఆర్‌సీబీ ప్లేఆఫ్స్‌కు ఆర్హత సాధించింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ముంబై బ్యాటర్లలో కిషన్‌(48),బ్రేవిస్‌(37), డేవిడ్‌ (34) పరుగులతో రాణించారు.

Mumbai Indians vs Delhi Capitals IPL 2022 – Cricket Match Prediction,  Fantasy XI Tips & Probable XI On Cricketnmore

ఢిల్లీ బౌలర్లలో అన్రిచ్ నోర్ట్జే,శార్దూల్ ఠాకూర్ చెరో రెండు వికెట్లు.. కుల్దీప్ యాదవ్ ఒక వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో పావెల్(43), పంత్‌(39) పరుగులతో టాప్‌ స్కోరర్‌లుగా నిలిచారు. ముంబై బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు, రమణదీప్ సింగ్ రెండు, సామ్స్‌, మయాంక్ మార్కండే తలా వికెట్‌ సాధించారు.