జుట్టుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొందరి హెయిర్ కి ఎప్పుడూ ఏదో ఒక ప్రాబ్లమ్ ఉంటూనే ఉంటుంది కారణం..తీసుకునే జాగ్రత్తలు అన్ని కెమికల్ యాడెడ్ షాంపూస్, ఆయిల్స్, మసాజ్ లే ఎక్కువ. శరీరానికి తగిని పోషకాహారం, ఇంటి చిట్కాలు పాటిస్తూ..మనం జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఈ శీతాకాలంలో హెయిర్ ఇంకా చర్మ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. స్కాల్ఫ్ హైడ్రైట్గా ఉంటుకోవాలి. ఈ ఇంటి చిట్కాలలతో మీ జుట్టు బౌన్సీగా ఉంటుందట. అంతేకాదు..స్కాల్ఫ్ కు హైడ్రైట్గా ఉంటుంది.
ఆలివ్ ఆయిల్, గుడ్డు పచ్చసోన మీ జుట్టుకు పోషణను అందిస్తుంది. గుడ్లు, ప్రోటీన్లకు మూలం. అందుకే అవి మన జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. ఈ కండీషర్ను తయారు చేయడానికి మీరు 2 గుడ్ల సొన, 4 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ బాగా మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయాలి. దీన్ని అప్లై చేసిన తర్వాత జుట్టును కాసేపు ఆరనివ్వాలి. ఆ తర్వాత మంచినీటితో కడగాలి. జుట్టు కండీషనర్ పెట్టినదానికంటే..సాఫ్ట్ గా ఉంటుంది.
అరటిపండులో సిలికా అధికంగా ఉంటుంది. ఇది జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. సిలికా మీ జుట్టును సిల్కీగా, ఎగిరిపడేలా చేస్తుంది. ఈ కండీషనర్ తయారు చేయడానికి 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 అరటి పండు గుజ్జు తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలపండి. జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత మీ జుట్టును కడగాలి.
జరేనియం ఎసెన్షియల్ ఆయిల్ జుట్టుకు చాలా మంచిది. చాలామందికి ఈ ఆయిల్ మీద అవహాహన ఉండదు. గ్రేప్ ఫ్రూట్ సీడ్ సారం రోగనిరోధక శక్తిని, చర్మాన్ని అలాగే జుట్టు సంబంధిత వ్యాధులను మెరుగుపరచడానికి ఒక అమృతంగా ఇది పనిచేస్తుంది. ఈ కండీషనర్ను తయారు చేయడానికి 1/3 కప్పు ఫిల్టర్ చేసిన నీరు 1 టేబుల్ స్పూన్ ఆర్గాన్ ఆయిల్, టేబుల్ స్పూన్ గ్రేప్ ఫ్రూట్ ఎసెన్షియల్ ఆయిల్, ఒక స్పూన్ జరేనియం ఆయిల్ వాడాలి. వీటన్నింటినీ కలిపి స్ప్రే బాటిల్ వేసుకుని బాగా షేక్ చేసి వాడాలి.
ఈ చిట్కాలతో మీ జుట్టు కండీషనర్ పెట్టినదానికంటే సాఫ్ట్ గా బౌన్సీగా అవుతుంది. వీటిల్లో మీకు సులువుగా ఉన్నది ఓ సారి ట్రై చేసి చూడండి మరీ.!