జైల్లోనూ స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ఉంది : మురళి మోహన్‌

-

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అరెస్ట్ కావడం పట్ల మాజీ ఎంపీ, ప్రముఖ నటుడు, నిర్మాత మురళీమోహన్ స్పందించారు. తాను గతంలో రాజమండ్రి ఎంపీగా పనిచేశానని, తనకు అక్కడి వివరాలు ఏ టు జెడ్ తెలుసని అన్నారు. సెంట్రల్ జైలు గురించి కూడా తెలుసని చెప్పారు. రాజమండ్రి జైలులో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ కూడా ఉందని మురళీమోహన్ వెల్లడించారు. అక్కడి ఖైదీలతో పెట్రోలు బంకులు ఏర్పాటు చేయించారని, నేత పనులు, వెల్డింగ్ పనులు, ఐరన్ వర్క్స్, బీరువాలు, స్కూలు బెంచీల తయారీలోనూ ఖైదీలకు శిక్షణ ఇచ్చారని వివరించారు. ఇక్కడి ఖైదీలకు స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ కార్యక్రమం అమలు చేస్తున్నారని, వారు సొంతంగా సంపాదించుకునేలా వృత్తిపనులు నేర్పిస్తున్నారని మురళీమోహన్ తెలిపారు.

I lost hundreds of crores due to CBN- Murali Mohan - TeluguBulletin.com

ఇది ఇలా ఉంటె, నిత్యం వివాదాలతో ట్రావెల్ చేసే ఆర్జీవీ మరోసారి తన మార్క్ చూపించారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఇష్యూలో ఎంటరై రచ్చ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ పై ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నిత్యం వివాదాలతో ట్రావెల్ చేసే ఆర్జీవీ మరోసారి తన మార్క్ చూపిస్తున్నారు. ఈ మధ్యకాలంలో రాజకీయంగా కూడా చాలా యాక్టివ్ అయిన ఈ డైరెక్టర్.. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఇష్యూపై సంచలన పోస్టులు పెడుతున్నారు. ఏ పార్టీలో చేరకపోయినా రాజకీయాలను ప్రభావితం చేసే కామెంట్లు చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ని ఉద్దేశిస్తూ ఆయన చేసిన ఓ ట్వీట్ తీవ్ర దుమారం రేపుతోంది. చంద్రబాబు అరెస్ట్‌ని ఎన్టీఆర్ పట్టించుకోవడం లేదని అర్థమవుతోందంటూ చిచ్చు పెట్టారు ఆర్జీవీ.

 

 

Read more RELATED
Recommended to you

Latest news