హైదరాబాద్ నడి బొడ్డున మర్డర్ జరిగింది. హైదరాబాద్ లోని సనత్ నగర్ లో ఈ దారుణ హత్య జరిగింది. సనత్ నగర్ ఆర్కే సొసైటీలో మాజీ రౌడీ షీటర్ కాలా ఫిరోజ్ పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ ఫీరోజ్ ను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తీసుకు వచ్చే సరికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఇక స్థానికుల సమాచారం తో ఘటనా స్థలానికి చేరుకున్న సనత్ నగర్ పోలీసులు హత్య జరిగిన తీరును పరిశీలించారు. దాడి చేసిన దుండగుల కోసం సి సి ఫూటేజ్ పరిశీలించిన పోలీసులు చుట్టుపక్కల వారిని కూడా ఆరా తీస్తున్నారు. గతంలో జరిగిన రౌడీ షీటర్ వాహిద్ హత్య కేసులో కాలా ఫిరోజ్ A1 గా ఉన్న కారణంగా వాహిద్ అనుచరులే ఫీరోజ్ ను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ఈ మేరకు కేసు నమోదు చేసి సనత్ నగర్ పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.