పాత వాహనాలు వాడుతున్నారా..ఇక ఈ కొత్త ట్యాక్స్‌ కట్టాల్సిందే..!

-

దేశంలో కాలుష్యాన్ని తగ్గించడానికి గాను కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే కాలుష్య నివారణలో భాగంగా పాతబడిన వాహనాలకు కొత్తగా గ్రీన్ టాక్స్ అనేది విధించాలని నిర్ణయించినట్లు సమాచారం అందుతోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను రవాణా శాఖ అధికారులు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి పంపగా ఆయన దానిని అప్రూవ్ చేసినట్లు చెబుతున్నారు. అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపాక దీనిని కేంద్రం నోటిఫై చేసే అవకాశం ఉందని అంటున్నారు. 

కాలుష్య నివారణలో భాగంగా ఎనిమిది సంవత్సరాల పైబడిన అన్ని రవాణా వాహనాలకు 10 నుంచి 25 శాతం దాకా గ్రీన్ టాక్స్ అనేది చెల్లించాల్సి ఉంటుందట. ఫిట్నెస్ సర్టిఫికెట్ అప్లై చేసే సమయంలో ఈ టాక్స్ వసూలు చేసే లాగా అధికారులు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. ఇక 15 సంవత్సరాల కంటే పాతబడిన వ్యక్తిగత వాహనాలు కూడా ఈ గ్రీన్ టాక్స్ పరిధిలోకి వస్తాయట. అయితే ఈ సమయంలో హైబ్రిడ్, ఎలక్ట్రిక్, cng, ఇధనాల్ అలానే lpg వంటి ప్రత్యామ్నాయ విఇంధనాలు వాడే వాహనాలకు మాత్రం ఈ టాక్స్ నుంచి మినహాయింపు ఉంటుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news