హైదరాబాద్‌లో మహిళపై అత్యాచారయత్నం.. గిటారిస్ట్‌ అరెస్ట్‌..

-

రోజు రోజుకు కామాంధులు రెచ్చిపోతున్నారు. అవకాశం దొరికితే చాలు స్రీలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. అయితే.. మహిళపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై జూబ్లీహిల్స్ పోలీసులు ఓ మ్యూజీషియన్ ను అరెస్టు చేశారు. అరెస్టయిన వ్యక్తి జూబ్లీహిల్స్‌కు చెందిన లలిత్ సెహగల్ (30)గా గుర్తించారు. అతను ఓ ప్రముఖ పబ్‌లో గిటారిస్ట్‌గా పనిచేస్తున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లలిత్ సెహగల్, ఆ మహిళ గతంలో స్నేహితులగా తెలుస్తోంది.

పలు కారణంగా వల్ల వారద్దరి మధ్య దూరం పెరిగినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే లలిత్ సెహగల్ ఆ మహిళ ఇంట్లోకి చొరబడి లైంగికదాడికి పాల్పడ్డాడు. అతడిని అడ్డుకున్న ఆ మహిళ అక్కడి నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది. మహిళ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి సెహగల్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం అతన్ని కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఇక అత్యాచారయత్నం జరిగిన బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించి, మానసికంగా ఓదార్పునిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version