ఆ పాత్ర‌కోసం తెగ క‌ష్ట‌ప‌డ్డానంటున్న పైసా వ‌సూల్ భామ‌…!

పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన పైసా వ‌సూల్ సినిమా ఏ స్థాయిలో విజ‌యం సాధించిందో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ సినిమాలో త‌న గ్లామ‌ర్‌తో ఆక‌ట్టుకున్న న‌టి ముస్కాన్ సేథి. ఈ సినిమాతో ఆమెకు మంచి పేరు వ‌చ్చింది. ఆ త‌ర‌వాత గ్లామ‌ర్ బ్యూటీ రాగ‌ల 24 గంట‌ల్లో అనే థ్రిల్ల‌ర్ చిత్రంలో న‌టించి మెప్పించింది. ఈ రెండు చిత్రాల ద్వారా మంచి పేరు తెచ్చుకోవ‌డంతో ముస్కాన్ సేథీ మ‌రో బాలీవుడ్ లో కొన్ని వెబ్ సీరిస్‌లు చేస్తూ మెప్పించింది. కాగా, ఇప్పుడు ఆ ఈ భామా తెలుగులో మ‌రోప్ర‌స్థానం అనే థ్రిల్ల‌ర్ జాన‌ర్ మూవీలో న‌టిస్తున్న‌ది. తెలుగు ఇప్ప‌టి వ‌ర‌కు రానీ కొత్తద‌నంలో సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈ మూవీలో గ్లామ‌ర్‌తో పాటుగా యాక్ష‌న్ సీన్స్‌లో కూడా న‌టించిన‌ట్టు ముస్కాన్ సేథి తెలిపారు. మ‌రో ప్ర‌స్థానంలో చేసిన పాత్ర వెరీ స్పెష‌ల్ అని, ఆ పాత్ర చేయ‌డం కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాన‌ని తెలిపింది.

లెంగ్తీ డైలాగులు, యాక్ష‌న్ సీన్స్ కోసం చాలా రిహార్సిల్స్ చేసిన‌ట్టు ఆమె పేర్కొన్నారు. త‌న పాత్ర‌ను అద్భుతంగా డిజైన్ చేసిన ప్ర‌తి ఒక్క‌రికి ఆమె థాంక్స్ చెప్పారు. ఇది ర‌ఫ్ అండ్ ర‌గ్‌డ్ ఫిల్మ్ అని, ప్ర‌తిపాత్ర, ప్ర‌తి సీన్ రియ‌లిస్టిక్‌గా ఉంటుంద‌ని అన్నారు. ఫైట్ మాస్ట‌ర్ యాక్ష‌న్ సీన్స్‌ను డిజైన్ చేసిన విధానం బాగుంద‌ని తెలిపారు జానీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో వ‌రుడు ఫేమ్ భానుశ్రీ మెహ్రా, క‌బీర్ దుహాన్ సింగ్‌, రాజా ర‌వీంద్ర త‌దిత‌రులు న‌టిస్తున్నారు. త‌నీష్ మెయిన్ లీడ్ రోల్ చేస్తున్న ఈ సినిమాను హిమాల‌య స్టూడియో మాన్ష‌న్స్‌, మిర్త్ మీడియా సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీ ఈనెల 24 వ తేదీన రిలీజ్ కాబోతున్న‌ది.