కుటుంబ సభ్యులు వదిలేసిన శవాలకు బందర్ లో అండగా ముస్లిం గ్యాంగ్…!

కరోనా పుణ్యమా అని మానవ సంబంధాలను కూడా మనుషులు మర్చిపోయే పరిస్థితి ఉందనే మాట వాస్తవం. కుటుంబ సభ్యులు కరోనాతో మరణిస్తే అంత్యక్రియలకు ప్రజలు అంత్యక్రియలకు ముందుకు రావట్లేదు. ఈ నేపధ్యంలో మేమున్నామని ముందుకు వచ్చి చనిపోయిన వారికి శాస్త్రోక్తంగా అంతిమ సంస్కారాలు ఖాజా భాయ్ టీమ్ నిర్వహిస్తుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మానవత్వం చాటుకుని, అందరి మన్ననలు పొందుతున్నారు.

పట్టణంలో గత వారం రోజులుగా ప్రతిరోజూ ముగ్గురు లేక నలుగురు అంత్యక్రియలను ఖాజా భాయ్ టీమ్ నిర్వహిస్తుంది. ఆదివారం రాత్రి 11:30 గంటలకు వలంద పాలెంకి చెందిన మేడపాటి గోవింద్ కరోనాతో మృతి చెందారు. ఆయన కరోనాతో ఇంట్లోనే ప్రాణాలు కోల్పోయారు. ఎవరూ ముందుకు రాకపోవడంతో సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు పూర్తి చేసారు. ఖాజా భాయ్ తో పాటు ఈ బృహత్తర కార్యక్రమంలో సయ్యేద్ ఖాజా, అబ్దుల్ అజీస్, మహబూబ్ బాషా, ఎండి ఖలీల్, అబ్దుల్ అజీం పాల్గొంటున్నారు.