హైదరాబాద్ లో కరోనా వస్తే ఈ నెంబర్ కి కాల్ చేయండి…!

హైదరాబాద్ లో కరోనా కేసులు భారీగా నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం. కరోనా కేసుల కట్టడికి సంబంధించి సిఎం కేసీఆర్ ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తున్నారు. అయినా సరే కేసులు మాత్రం ఆగడం లేదు. కరోనా కేసులను కట్టడి చేసేందుకు ఎప్పటికప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక తాజాగా కరోనా నియంత్రణ పై జీహెచ్ఎంసీ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోవిద్ కంట్రోల్ రూమ్ ను వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి పరిశీలించారు.

కరోనా కంట్రోల్ రూమ్ నిర్వహణపై జీహెచ్ఎంసీ లో ఉన్నతాధికారుల సమావేశం అయ్యారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, రాష్ట్ర కోవిద్ కంట్రోల్ కేంద్రం ఇంచార్జి రాహుల్ బొజ్జా, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, వైద్య శాఖ ఓ.ఎస్.డి. గంగాధర్ హాజరు అయ్యారు. ఈ సందర్భంగా రిజ్వీ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ పరిధిలో కొరోనా వైద్య సలహాలు, మెడికల్ కిట్ లకై 040 – 21 11111111 అనే నెంబర్ కు సంప్రదించాలి అని సూచించారు. కంట్రోల్ రూమ్ లో వైద్య సలహాలు అందించేందుకై ప్రత్యేకంగా వైద్యుల నియామకం చేపట్టామని అన్నారు.