అయోధ్య కేసులో సుప్రీం తీర్పుపై సున్నీ వక్ఫ్ బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది. వక్ఫ్ బోర్డు తరఫు న్యాయవాది షేక్ అహ్మద్ సయ్యద్ మాట్లాడుతూ.. తీర్పు సంతృప్తికరంగా లేదని.. అయినా గౌరవిస్తామన్నారు. తీర్పు కాపీని మరింత పరిశీలించాల్సి ఉందని.. ఆ తర్వాతే భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటామన్నారు. ఇక కోర్టు తీర్పుపై ఎవరికి వారు రకరకాలుగా స్పందిస్తున్నారు.
అందరూ శాంతియుతంగా ఉండాలని.. ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టరాదని విజ్ఞప్తి చేశారు. దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన రామజన్మభూమి కేసులో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం శనివారం కీలక తీర్పు వెల్లడించింది. వివాదాస్పద స్ధలం తమదేనంటూ షియా బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు… నిర్మోహి అఖాడా పిటిషన్‌ను సైతం తోసిపుచ్చింది.