సూర్య గ్రహణం అంటే ఏమిటి..?
సూర్యుని కాంతి నేరుగా భూమిని చేరకుండా మధ్యలో చంద్రుడు ఉంటాడు. దీనితో చంద్రుడి నీడ భూమిపై పడుతుంది. ఇదే సూర్య గ్రహణం.
గ్రహణ సమయం వివరాలు:
అక్టోబర్ 25, సాయంత్రం 5.01 ని.లకు ప్రారంభమయి, 6.26 ని.లకు పూర్తి కానుంది. గ్రహణ పుణ్యకాలము 1.25 ని.లు. గంటసేపు సూర్య గ్రహణం ఉండనుంది.
గ్రహణాన్ని చూస్తే ఏమవుతుంది..?
గ్రహణం చూస్తే కంటికి నష్టం, అంధత్వాన్ని కలిగిస్తుంది. కనుక జాగ్రత్తగా ఉండాలి.
గ్రహణం తరవాత ఏం చెయ్యాలి..?
గ్రహణ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. మనం తినే వాటి మొదలు అన్ని వస్తువుల మీద గరిక వెయ్యాలి. ఆ తీరం లో ఆహారం విషపూరితంగా మారుతుంది. అందుకే గరిక వెయ్యాలి. ఇది విరుగుడుగా పని చేస్తుందట.
అలానే గ్రహణ సమయంలో శివారాధన చేసుకుంటే మంచిది. లేదంటే ఏదైనా జపం చేయడం లాంటివి చెయ్యండి.
గ్రహణ సమయంలో ఏమి తినకూడదు. వంట కూడా చేసుకోకూడదు.
గ్రహణం అయ్యాక స్నానం చెయ్యాలి. కుదిరితే చెరువులు, సముద్రాల్లో స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
లేదంటే గంగా జాలం నీటిలో వేసుకు చెయ్యచ్చు.
గ్రహణం అయ్యాక దానధర్మాలు చేస్తే మంచి కలుగుతుంది.
ఏదైనా దగ్గరలో వుండే ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుంటే కూడా మంచిది.
గ్రహణం అయ్యాక తులసి మొక్కలపై గంగాజలం చల్లాలి. ఇలా చేస్తే తులసి మొక్కలు శుద్ధిగా మారతాయి.
కళ్ళతో గ్రహణం చూడకూడదు.
అలానే నిద్రపోకూడదు.
గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలి.
పదునైన వస్తువులను వాడడం వంటివి చెయ్యరాదు. అలానే బయటకు కూడా వెళ్ళకూడదు. ఇలా గ్రహణ సమయంలో పాటిస్తే మంచిది.