డిఫెరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన కన్నడ డబ్బింగ్ సినిమా కాంతారా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొంటున్న సంగతి అందరికి తెలిసిందే. దీపావళి కు నాలుగు సినిమాలు రిలీజ్ అయినా కూడా, ఈ సినిమా హౌస్ ఫుల్స్ తో విపరీత మైన కలెక్షన్లు వసూలు చేస్తోంది. ఇప్పటికే పెట్టుబడికి ఎన్నో రెట్లు అధికంగా డబ్బులు రాబట్టింది.
సినిమా చూసిన ప్రతి ఒక్కరు అద్భుతంగా ఉందని , ఈ సినిమా చూస్తున్నంత సేపు మరో లోకంలో వున్నట్లుగా అనిపించిందని,అలాగే క్లైమాక్స్ లో గూస్ బంప్స్ వచ్చి ఒళ్ళు జలదరించింది అని చాలా మంది సెలబ్రిటీలు కాంతారా ఎక్స్పీరియన్స్ ను కళ్ళకు కట్టినట్లు గా చెప్పారు. ఇక మామూలు ఆడియన్స్ కూడా అదే ఎక్స్పీరియన్స్ చవి చూశారు.ఇదిలా ఉంటె తాజాగా ఈ సినిమా చూసి ఓ వ్యక్తి గుండె పోటుతో మృతి చెందడం ఇప్పుడు కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే..
కర్నాటక రాష్ట్రం లోని మాండ్య జిల్లా నాగమంగళలోని వెంకటేశ్వర థియేటర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. కాంతారా సినిమా చూసి రాజశేఖర్ అనే వ్యక్తి బయటకు వస్తుండగా గుండెపోటుతో మృతి చెందాడు. సదరు వ్యక్తి నాగమంగళ తాలూకాలోని సరిమేగలకొప్ప నివాసి.. నిన్న వెంకటేష్ కాంతార సినిమా చూసేందుకు సినిమాకి వచ్చాడు. కాంతార సినిమా చూస్తుండగా రాజశేఖర్‌కు ఛాతీ నొప్పి వచ్చింది. అక్కడే కుప్పకూలిపోయాడు. అతన్ని హాస్పిటల్ కు తరలించగా రాజశేఖర్ గుండెపోటుతో మృతి చెందినట్లు చెప్పారు.