ఈ రోజు బంగ్లాదేశ్ మరియు న్యూజిలాండ్ జట్ల మధ్యన మిర్పూర్ వేదికగా మొదటి వన్ డే జరుగుతోంది. వర్షం కారణంగా అంపైర్లు మ్యాచ్ ను కేవలం 42 ఓవర్లకు మాత్రము కుదించడం జరిగింది. కాగా న్యూజిలాండ్ జట్టు జూనియర్ లతో బరిలోకి దిగగా టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ కు దిగింది. కివీస్ ను ఆరంభం నుండి స్వేచ్ఛగా బాట్ జులిపించకుండా చేయడంలో ముస్తాఫిజర్ రెహమాన్ మరియు తంజీమ్ లు సక్సెస్ అయ్యారు అని చెప్పాలి. ముఖ్యంగా ముస్తాఫిజర్ అయితే చక్కని లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్ తో కివీస్ ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. ఇతను 7 ఓవర్లు బౌలింగ్ చేసి ఒక మేడిన్ ఓవర్ వేసి 27 పరుగులు ఇచ్చి మూడు కీలక వికెట్లు దక్కించుకున్నాడు. ఇతను వరుసగా ఫైన్ అలెన్ 9, బౌస్ 1, నికోలస్ 44 ను అవుట్ చేసి కివీస్ కు షాక్ ఇచ్చాడు.
బంతిని టచ్ చేయాలన్న భయపడేలా బౌలింగ్ చేసి ముస్తాఫిజర్ కివీస్ ఆటగాళ్లను వణికించాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ ఓవర్ లలో 5 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది.. మళ్ళీ వర్షం రావడంతో మ్యాచ్ ను నిలిపివేశారు.