ముత్తూట్ అదిరిపోయే కొత్త స్కీమ్‌ను మహిళకు తీసుకువచ్చింది. ఈ స్కీమ్ ప్రత్యేకత ఏంటంటే తక్కువ వడ్డీకే బంగారంపై మహిళలకు రుణం పొందవచ్చు. ముత్తూట్ ఫిన్‌కార్ప్ మహిళ వినియోగదారుల పేరిట ఆత్మనిర్భార్ మహిళా గోల్డ్ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రిస్టార్ట్ ఇండియా మిషన్‌కు కొనసాగింపుగా ఈ కొత్త పథకానికి ముత్తూట్ శ్రీకారం చుట్టింది. ఈ పథకాన్ని ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఆవిష్కరించారు. ఈ ఆత్మ నిర్భార్ పథకంలో కేవలం మహిళలకు మాత్రమే వర్తిస్తుంది. మహిళలు మాత్రమే తక్కువ ధరకు ఎక్కువ డబ్బులు పొందవచ్చు.
బంగారం విలువకు ఎక్కువ మొత్తంలో లోన్ కింద డబ్బులు పొందవచ్చు. ఈ పథకం వల్ల మహిళలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాకపోతే గోల్డ్ లోన్ తీసుకోవాలనుకునేవారు బ్యాంకుల్లో తీసుకుంటే నయం. ఎందుకంటే బ్యాంకుల్లో ప్రస్తుతం బంగారం పై వడ్డీ రెట్లు కూడా తక్కువగా ఉంటుంది. ఈ మధ్య వివిధ బ్యాంకులు సైతం వడ్డీ రేట్లను సవరించాయి. హోమ్ లోన్లపై కూడా రుణ రేటును తగ్గించాయి. అందులో ఎస్బీఐ, కొటాక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించాయి. దీంతో ఇళ్లు కట్టుకోవాలనుకునే వారు హోమ్ లోన్‌ను ఈ సమయంలో తీసుకోవడం ఉత్తమం.
ఇదివరకే మీరు హోమ్ లోన్ తీసుకున్న, మీ బ్యాంకు వేరేది అయినా ఫర్వాలేదు. ఈ బ్యాంకులకు మీ ఖాతాలను మార్చుకునే వెసులుబాటు కూడా ఉంది. బంగారం పై వడ్డీరేట్లు కూడా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఎస్బీఐలో అయితే గోల్డ్‌లోన్‌పై వడ్డీ రేటు 7.5 శాతం ఉంటుంది. ఇతర బ్యాంకుల్లో వడ్డీ రేట్లు అటూఇటుగా ఇదే స్థాయిలో ఉంటాయి. గోల్డ్ ఫైనాన్స్ కంపెనీల్లో అయితే 12 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తాయి.