నా ఆల్ టైం ఫేవరెట్ డైరెక్టర్స్ వారే: ప్రభాస్..!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం కెరియర్ పరంగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా కొనసాగుతున్న ఈయన తాజాగా బాలకృష్ణ చేస్తున్న ప్రముఖ ఆహా ఓటీటీ లో కొనసాగుతున్న క్రేజీ టాక్ షో అన్ స్టాపబుల్ సీజన్ 2 కి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అయితే ఈఎపిసోడ్ కి తన స్నేహితుడు యాక్షన్, మ్యాచో స్టార్ గోపీచంద్ తో కలిసి గెస్ట్ గా రావడం జరిగింది. వీరిద్దరూ కలిసి వచ్చిన ఈ ఎపిసోడ్ ను ఆహా రెండు భాగాలుగా ప్రసారం చేయబోతున్నారు..

ఇకపోతే వాటిలో మొదటి భాగాన్ని నిన్న రాత్రి 9:00 గంటలకు ప్రసారం చేయగా రెండవ భాగాన్ని జనవరి 6వ తేదీన స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇందులో సరదా సరదా ప్రశ్నలు, ఎంటర్టైన్మెంట్ అంశాలతో కొనసాగిన ఈ భాగం అందరిని ఎంతగానో ఆకట్టుకుంటూ దూసుకెళ్తోంది. అందులో భాగంగానే తనకు ఇష్టమైన ఆల్ టైం ఫేవరెట్ దర్శకులు ఇద్దరూ ఉన్నారు అని వారి పేర్లు కూడా తెలిపారు ప్రభాస్. ఇంతకూ వారు ఎవరంటే దివంగత దర్శకుడు బాబు అలాగే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం అని చెప్పారు ప్రభాస్.

Prabhas' Next Inspired By Mani Ratnam's Movie?

వారిద్దరి సినిమాలను తాను ఏమాత్రం మిస్ కాకుండా చూస్తానని.. తప్పకుండా భవిష్యత్తులో అవకాశం వస్తే మణిరత్నం గారితో వర్క్ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని కూడా ప్రభాస్ తెలిపారు. ఈ విషయం తెలిసి అటు కోలీవుడ్ అభిమానులు, ఇటు టాలీవుడ్ అభిమానులకు కూడా తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతూ పాన్ ఇండియా లెవెల్లో మరింత పాపులారిటీ దక్కించుకుంటూ ఉండటం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news