కేసీఆర్ అసెంబ్లీకి వస్తే మాట్లాడాలనేది నా కోరిక.. మంత్రి పొంగులేటి ఆసక్తికర వ్యాఖ్యలు

-

ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే తెలంగాణలో రియల్ ఎస్టేట్ అంతా పడిపోతుందని.. ఆంధ్రాకే పోతుందని పలువురు పేర్కొన్నారు.  తాజాగా మంత్రి పొంగులేటి అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం పడిపోలేదన్నారు. అమరావతిలో వరద వల్ల ఏపీకి పెట్టుబడులు వెల్లే పరిస్థితి లేదని.. అక్కడ పెట్టుబడి పెట్టడానికి ఇన్వెస్టర్లు భయపడుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా భయం ప్రజల్లో మాత్రం లేదు. మొదట్లో తప్పుడు ప్రచారం జరిగినా ఇప్పుడు వాస్తవం లేదని తెలిసిందన్నారు.

అప్పులపై కేటీఆర్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. కార్పొరేషన్ లోన్స్ తో కలిపి మొత్తం లెక్కలు బీఆర్ఎస్ నేతలు భయటపెట్టాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్ పేరుతో చేసే అప్పులు సైతం ప్రభుత్వం ఖాతాలోకి వస్తాయనే విషయం కేటీఆర్ తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు. 7లక్షల 20వేల కోట్లు తెలంగాణ రాష్ట్రానికి అప్పులున్నాయి. బీఆర్ఎస్ హయాంలో జరిగిన వ్యవహారం అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version