మహిళలను వేధించే విషయంలో ఎన్ని చట్టాలు తీసుకొచ్చి కట్టడి చేసి, కఠిన చర్యలు అమలు చేస్తున్నా సరే కొందరు మాత్రం తమ పంథా ను మార్చుకోరు. ఇష్టం వచ్చినట్టు వ్యవహారాలు నడుపుతూ ఉంటారు. బాధ్యత కలిగిన పదవుల్లో ఉన్న వారు కూడా స్థాయి మరిచి దిగజారుడు పనులు చేస్తున్న ఘటనలు ఈ మధ్య కాలంలో తరుచుగా వార్తల్లో మనం చూస్తూనే ఉన్నాము. తాజాగా ఒక ఘటన వెలుగులోకి వచ్చింది.
తన భర్తపై ఒక ఎమ్మెల్యే భార్య ఫిర్యాదు చేసింది. మహిళను బ్లాక్ మెయిల్ చేశాడని ఆరోపణలు చేస్తూ ఎమ్మెల్యే భార్య డెహ్రాడూన్ లోని నెహ్రూ కాలనీ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. దీనిపై మాట్లాడిన ఉత్తరాఖండ్ రాష్ట్ర లా అండ్ ఆర్డర్ డీజీ అశోక్ కుమార్, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. బిజెపి ఎమ్మెల్యే మహేష్ నేగి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు అని ఆయన భార్య ఆరోపించారు.