భార‌త్-నేపాల్‌ మ‌ధ్య పలు కీలక అంశాలపై చ‌ర్చ‌లు..!

-

భారత్, నేపాల్ మధ్య ఇవాళ పలు అంశాలపై చర్చలు జరగనున్నాయి. భార‌త అధికారి విన‌య్ మోహ‌న్ క్వాత్రా, నేపాల్ విదేశాంగ కార్య‌ద‌ర్శి శంక‌ర్ దాస్ బైరాగి ఈ చ‌ర్చ‌ల్లో పాల్గొంటారు. నేపాల్‌లో భారత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులపైనే ఈ చర్చలు జరగనున్నాయి. ‌ ఇరు దేశాలు ఉమ్మడిగా చేపట్టిన ప్రాజెక్టుల పురోగతిపై ఉమ్మడిగా సమీక్షించే విధానంలో భాగంగా ఈ సమావేశం జరగనుంది. కాగా, పోయిన సంవత్సరం జూలైలో రెండు దేశాల మ‌ధ్య ఏడ‌వ స‌మావేశం జ‌రిగింది.

nepal
nepal

ఆ స‌మావేశంలో రైల్ లింకు, పెట్రోలియం పైప్‌లైన్‌, రోడ్లు, బ్రిడ్జ్‌లు, బోర్డ‌ర్ చెక్ పోస్టులు, ఎన‌ర్జీ, ఇరిగేష‌న్ లాంటి ప్రాజెక్టుల‌పై స‌మీక్ష నిర్వ‌హించారు. అయితే ఇండియాలోని పలు ప్రాంతాలు మావే అంటూ నేపాల్ కొత్త మ్యాప్‌ను విడుదల చేసిన నేపథ్యంలో ఈ చర్చలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news