Naa Saami Ranga : నాగార్జున నా సామి రంగ డిజిటల్‌ రైట్స్‌, ట్రైలర్ అప్‌డేట్‌

-

టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా విజయ్ బిన్ని దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం నా సామి రంగా. ఈ సినిమాలో ఆషికా రంగనాథ్‌ హీరోయిన్ గా నటిస్తుంది. అల్లరి నరేష్ ,రాజ్ తరుణ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 14న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇప్పటికే లాంఛ్ చేసిన నా సామి రంగ టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌, టైటిల్ గ్లింప్స్‌ సోషల్ మీడియాలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

Naa Saami Ranga Teaser

ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో సినిమా ట్రైలర్ను జనవరి 9న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం డిజిటల్‌ స్ట్రీమింగ్ రైట్స్‌ను పాపులర్‌ ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీ+హాట్ స్టార్‌ సొంతం చేసుకుంది . ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.ఇప్పటికే నా సామి రంగ టైటిల్‌ ట్రాక్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ సాంగ్‌కు డైరెక్టర్ విజయ్‌ బిన్ని అండ్ టీం డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news