హాకీ ఆటగాడిగా నాగ చైతన్య.. లీకైన పిక్.

-

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ చిత్రం విడుదలకి రెడీగా ఉంది. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంపై అందరికీ చాలా అంచనాలు ఉన్నాయి. లవ్ స్టోరీ రిలీజ్ కాకముందే మనం దర్శకుడు విక్రమ్ కె కుమార్ తో థ్యాంక్యూ అనే టైటిల్ తో సినిమా మొదలెట్టాడు నాగ చైతన్య. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న థ్యాంక్యూ సినిమా నుండి ఒక పిక్ బయటకి వచ్చింది. ఈ చిత్రంలో నాగ చైతన్య, హాకీ క్రిడాకారుడిగా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది.

క్రీడా మైదానంలో నిల్చున్న నాగ చైతన్య, చేతిలో హాకీ కర్ర పట్టుకున్నాడు. ఐతే ఈ పిక్చర్ ఎలా బయటకి వచ్చిందో తెలియదు గానీ అక్కినేని అభిమానులని కలవర పెడుతుంది. సినిమా గురించి ఎలాంటి సమాచారం బయటకి రాకముందే ఇలా లీకులు ఇబ్బందిగా అనిపిస్తున్నాయి. బీవీఎస్ రవి కథ అందిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇందులో నాగ చైతన్య సరసన ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version