అఖిల్ ను ఫాలో అవుతున్న నాగ చైతన్య..!

-

బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టిన చైతూ.. నెక్ట్స్ ప్రాజెక్ట్స్ కూడా పిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే లేడీ డైరెక్టర్‌ నందిని రెడ్డితో ఓ ప్రాజెక్ట్ ఉంటుందని చాలా రోజులుగా వినిపిస్తోంది. ఇక ఇప్పుడు బొమ్మరిల్లు భాస్కర్‌కు కూడా గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. గతేడాది అఖిల్‌తో తెరకెక్కించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు భాస్కర్.

అలాగే అఖిల్‌కు ఫస్ట్ హిట్ ఇచ్చిన దర్శకుడిగా నిలిచాడు. ఇక ఇప్పుడు నాగచైతన్యతో కూడా ఒక యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేయబోతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే చైతన్యకు కథ వినిపించగా.. ఓక చెప్పాడట. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించ‌బోతున్న‌ట్లు సమాచారం. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రాబోతున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా సమంత-చైతూ విడిపోయిన తర్వాత.. అటు సమంతనే కాదు.. చైతన్య కూడా వరుసగా సినిమాలను లైన్లో పెడుతున్నాడని చెప్పొచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news