నాగచైతన్య- సమంత విడాకులపై సంచలన వ్యాఖ్యలు చేసిన నాగార్జున… మొదట సమంతనే ఇలా చేసిందంటూ…

నాగచైతన్య- సమంత విడాకులు జరిగిన నెలలు గడుస్తున్నా… వీరిద్దరి గురించి ఏదో న్యూప్ హల్చల్ చేస్తూనే ఉంది. తాజాగా సమంత – చైతన్య మాట్లాడుతూ.. షాకింగ్ కామెంట్లు చేశారు. ముందుగా సమంతే.. నాగచైతన్య నుంచి విడాకులు కోరుకుంది అంటూ వ్యాఖ్యానించారు. ఆమె నిర్ణయానికి చైతన్య అంగీకరించారని నాగార్జున వెల్లడించారు. సమంత- నాగచైతన్య ఎంతో ప్రేమగా ఉండేవారని… గతేడాది న్యూఇయర్ వేడుకులు కూడా జరుపుకున్నారని అన్నారు. వీరిద్దరి మధ్య సమస్య ఏమిటో తనకు తెలియదని నాగార్జున అన్నారు. 

వీరిద్దరి మధ్య విడిపోయేంత సమస్యలు కూడా ఏమీ లేవని ఆయన అన్నారు. అయితే చైతన్య, అక్కినేని కుటుంబ పరువు గురించి, నాగురించి ఎక్కువగా ఆలోచించాడని నాగార్జున పేర్కొన్నారు. కొంత కాలంగా ఈ అంశంపై ఎక్కువగా మాట్లాడేందుకు ఇష్టపడని నాగార్జున ఈ వ్యాఖ్యలు చేశారు. సమంత తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించే చైతన్య ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.