పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తరుణంలోనే జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు ఎమోషనల్ అయ్యారు. నేను ఇదే మొదటిసారి అసెంబ్లీ చూడటమని…. మా ప్రెసిడెంట్, తమ్ముడు శాసన సభలో అడుగుపెట్టాడు..ఇది ఒక థ్రిల్ అన్నారు. పవన్ మంత్రి గా అసెంబ్లీకి రావడం థ్రిల్లింగ్ కంటే ఒక బాధ్యత అని… పంచాయతీరాజ్, అటవీ పర్యావరణ శాఖలు లోతుగా పని చేయాలని ఫోకస్ గా ఉన్నాడని వెల్లడించారు.
పదవి తాలూకు పవర్ ను ఆశించేలా మేం లేము…కొత్తగా పదవి వల్ల వ్యక్తిగతంగా వచ్చే లాభం ఏం లేదన్నారు. సినిమా వరకే పవన్ పవన్ స్టార్.. ఆయన అసలు లో రియల్ లీడర్…పదేళ్ల కల నెరవేరింది,ప్రజా ప్రస్థానం మొదలైందని వెల్లడించారు.
డిప్యూటీ C.M హోదా లో శాసనసభ లో ప్రమాణస్వీకారం చేస్తున్నటువంటి నా తమ్ముడు పవన్ కళ్యాణ్ ని చూసి నా మనసు ఆనందంతో ఉప్పొంగిపోయిందని తెలిపారు. తోడబుట్టిన వాడిగా & జనసేన కార్యకర్తగా మా నాయకుడి ప్రమాణస్వీకారం చూసి నా గుండె ఆనందంతో నిండిపోయింది, పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ కి వెళ్లాలి ‘పవన్ కళ్యాణ్ అను నేను’ అని ప్రమాణస్వీకారం చేయాలనేది పదేళ్ల నా కల అన్నారు.