ఈసారి నేను మౌనంగా ఉండలేను : మిలిందా గేట్స్‌

-

 అమెరికాలో మరికొన్ని నెలల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అధ్యక్ష పీఠం కోసం ఇప్పటికే ప్రస్తుత ప్రెసిడెంట్  జో బైడెన్‌, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హోరాహోరీగా పోరాడుతున్నారు. ఈసారి గెలుపెవరిదా అని అమెరికాతో పాటు యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా ఎన్నికలపై ప్రముఖ దాత, బిల్‌గేట్స్‌ మాజీ భార్య మిలిందా గేట్స్‌ ఆసక్తికర పోస్ట్‌ చేశారు.

వచ్చే ఎన్నికల్లో తన ఓటు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ కే అని మిలిందా తెలిపారు. అధ్యక్ష ఎన్నికల్లో ఓ నేతకు ఆమె బహిరంగంగా మద్దతు ప్రకటించడం ఇదే తొలిసారి. ఇంతకుముందెన్నడూ తాను అధ్యక్ష అభ్యర్థికి ఇలా మద్దతు ప్రకటించలేదు. కానీ ఈసారి ఎన్నికలు మహిళలు, కుటుంబాలకు చాలా కీలకమైనందున తాను మౌనంగా ఉండలేనని మిలిందా అన్నారు.

మహిళల భద్రత, వారి ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక శక్తి, వ్యక్తిగత హక్కులను కాపాడే నాయకుడు కావాలన్న ఆమె.. ప్రజాస్వామ్య వ్యవస్థలో మహిళలు పూర్తిగా భాగస్వాములయ్యే స్వేచ్ఛను కల్పించాలని పేర్కొన్నారు. అందుకే ఈసారి తన ఓటు అధ్యక్షుడు బైడెన్‌కేనని అని మిలిందా తన పోస్టులో రాసుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news