ఇన్నాళ్లు జబర్ధస్త్ షోను తనదైన జడ్జిమెంట్‌తో నడిపించిన నాగబాబు.. ఇపుడు సడెన్‌గా ఆ ప్రోగ్రామ్‌కు గుడ్ బై చెప్పారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆయన జబర్దస్త్ కామెడీ షోకు జడ్జీగా వ్యవహరించడం వల్ల నాగబాబుకు నవ్వుల నవాబు అనే బిరుదు కూడా వచ్చి చేరింది. అయితే జబర్దస్త్ కామెడీ షో నుండి బయటకు వచ్చేసిన నాగబాబు మరోసారి క్లారిటీ ఇస్తూ జబర్దస్త్ గురించి సంచలన విషయాలు బయటపెట్టారు. అంతా నా ఇష్టం అనే సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా స్పందించిన నాగబాబు.. నేను ఈటీవీలో అదుర్స్ అనే షో చేశాను. దీంతో మేనేజర్ ఏడుకొండలుతో మంచి ర్యాప్ ఏర్పడింది.
ఆయన నుంచి నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డిని కలిసానని.. ఆయన అప్పటి వరకు తనకు డైరెక్ట్‌గా ఫోన్ చేయలేదని చెప్పాడు నాగబాబు. ఏడుకొండలే శ్యాం ప్రసాద్ రెడ్డికి నన్ను పరిచయం చేశారు. వాళ్ల మల్లెమాల బ్యానర్ నుంచి అదుర్స్ తర్వాత జబర్దస్త్ కామెడీ షో ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారని.. దానికి మీరు జడ్జిగా ఉండాలన్నారని చెప్పాడు. అయితే ఎవరికీ తెలియని సీక్రెట్ ఏంటంటే.. శ్యాం ప్రసాద్ గారికి గాని నాకు గాని ఇంత లాంగ్ షో చేస్తామని ఎవరికీ తెలియదు. కేవలం జబర్దస్త్‌ను 25 ఎపిసోడ్స్ కోసమే ప్లాన్ చేసుకున్నారని.. దానికి తనతో పాటు రోజాను జడ్జిగా ఉండాలని కోరినట్లు చెప్పాడాయన.
అయితే మరో ట్విస్ట్ ఏంటంటే.. ఈ ప్రోగామ్‌కు తనతో పాటు రోజాను జడ్జిగా ఉండాలని కోరారు. కానీ అప్పటికే తాను ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్ వైపు వెళ్లడం.. రోజా తెలుగుదేశం నుంచి వైసీపీలో చేరడం జరిగిందని అన్నారు. అయితే పొలిటికల్‌గా ఉండే విభేదాలు ఉండొచ్చు కాని.. క్రియేటివ్ ఫీల్డ్‌లో అలా ఉండకూడదని ఆరోగ్యవంతమైన వాతావరణంలో రోజా నేను జబర్దస్త్ చేయాలనే నిర్ణయానికి వచ్చి.. ఇద్దరం కలిసి షో చేశామన్నారు. షో స్టార్టింగ్‌లో అనసూయ యాంకర్‌గా ఉండేది. ఇక అదృష్టం ఏంటంటే ఈ షోకు తిరుగులేని రేటింగ్ వచ్చింది. అప్పటికి 4 రేటింగ్ రావడమే ఎక్కువగా ఉండేది. అలాంటిది జబర్దస్త్‌కి 6 నుండి మొదలై 15 వరకూ పెరిగింది.
అయితే 25 ఎపిసోడ్స్ అన్నది పక్కన పెట్టేసి ఇప్పటి వరకూ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఇక మొదట్లో మాకు జబర్దస్త్ కాన్సెప్ట్ చెప్పిన వ్యక్తి డైరెక్టర్ సంజీవ్. ఆయన దగ్గరే నితిన్, భరత్ అనే ఇద్దరు కుర్రాళ్లు ఉండేవారు. వాళ్లు మంచి క్రియేటివ్ మైండ్‌తో వచ్చి షోని నడిపించే రేంజ్‌కు వెళ్లారు. తర్వాత అనసూయ తప్పుకోవడం.. రష్మి రావడం.. రాను రాను ఈ టీంలలోనుండే కొత్త కొత్త టీంలు పుట్టుకురావడం.. ఇలా జబర్దస్త్ షోలో ఎన్నో మార్పులు జరిగాయని చెప్పుకొచ్చాడు నాగబాబు. అలాగే జబర్దస్త్ షోలో మీరు చూస్తున్నది ఒక్క నైట్‌లో పుట్టిన టాలెంట్ కాదాని.. సంవత్సరాలు పాటు చేసి కృషని.. ఈ కృషిలో చాలా మంది భాగస్తులు ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు.