మరోసారి పెళ్లి పీటలు ఎక్కిన నాగ చైతన్య..!

-

ప్రస్తుతం అక్కినేని వారసుడు నాగచైతన్య వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విభిన్నమైన యూత్ ఫుల్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమాలో నటిస్తున్నారు ఇక ఈ సినిమాలో నాగచైతన్య సరసన ఫిదా బ్యూటీ సాయిపల్లవి నటిస్తోంది. ఈ సినిమాపై అటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాకు సంబంధించి ఏ అప్ డేట్ బయటకు వచ్చిన వైరల్ గా మారిపోతుంది.

ఇక దీపావళి సందర్భంగా ఈ సినిమాలో నాగచైతన్య సాయి పల్లవి పాత్రలతో కూడిన ఒక సన్నివేశానికి సంబంధించిన పోస్టర్ను చిత్రబృందం విడుదల చేయగా ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. నాగచైతన్య సాయి పల్లవిని పెళ్లి చేసుకునేందుకు పెళ్లి పీటల మీద కూర్చున్న పోస్టర్ ప్రస్తుతం అభిమానులను ఎంతగానో ఆకర్షిస్తోంది. తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో రోజురోజుకు అంచనాలు పెరిగి పోతూనే ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news