నాగ్‌ ‘వైల్డ్ డాగ్’ పోస్ట‌ర్ విడుద‌ల..!

-

ఆరు ప‌దులు దాటిన గ్లామ‌ర్‌గా క‌నిపిస్తూ, కుర్ర హీరోల‌కి స‌వాల్ విసురుతూ.. అమ్మాయిల మనసుల్ని కొల్లగొట్టిన నవ మన్మథుడు నాగార్జున 61 వ పుట్టిన రోజు సందర్బంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లు వెత్తుతున్నాయి. ప్ర‌స్తుతం నాగ్ ‘వైల్డ్ డాగ్’ అనే సినిమా చేస్తున్నారు. నాగ్ బర్త్ డే సందర్బంగా చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబందించిన పోస్ట‌ర్ విడుద‌ల చేసింది. పోస్టర్ కి ఆడియెన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. మిగతా పాత్రలకు సంబంధించిన డీటెయిల్స్ ని కూడా పోస్టర్ లో రివీల్ చేశారు.

ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 70% పూర్తయ్యింది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పై రూపొందిస్తున్న ఈ సినిమాను అహిషర్ సోలమన్ డైరెక్ట్ చేస్తున్నాడు. కరోనా మహమ్మారి తీవ్రత తగ్గిన తరువాత వీలైనంత త్వరగా షూటింగ్ పనులను ముగించుకొని సమ్మర్ లోనే సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news