దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా చైర్మన్ రజనీశ్ కుమార్ పదవీ కాలం ఈ అక్టోబర్ తో ముగియనున్నది. ఈ నేపథ్యంలో కొత్త చైర్మన్‌ను ఎంపిక చేసేందుకు బ్యాంక్ బోర్డు బ్యూరో (బీబీబీ) సన్నాహాలు చేస్తుంది. కొందరు ఎండీలను ఇంటర్వ్యూ చేసిన బీబీబీ పనితీరు, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని దినేష్ కుమార్ ఖారాను చైర్మన్‌గా, చల్లా శ్రీనివాసులను రిజర్వు అభ్యర్థిగా ప్రతిపాదించింది.
ఇకపోతే ఢిల్లీలోని ఎఫ్ఎమ్ఎస్ నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చేసి.. 1984లో ఎస్బీఐ ప్రొబేషనరీ అధికారిగా చేరారు దినేష్ కుమార్ ఖారా. అలాగే ముఖ్యంగా ఎస్బీఐ లో భారతీయ మహిళా బ్యాంకు సహా, ఐదు బ్యాంకుల విలీనంలో ఖారా ఆయన ప్రధాన పాత్ర పోషించారు. ప్రస్తుతం గ్లోబల్ బ్యాంకింగ్ అండ్ సబ్సిడియరీస్ విభాగానికి మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు దినేష్ కుమార్ ఖారా.