సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం అనేది అసాధ్యం.. అయితే ఇండస్ట్రీ లోకి వచ్చిన ఎక్కువమంది అభిమానుల ఆదరణ పొంది స్టార్ హీరోలుగా, హీరోయిన్గా కొనసాగితే మరి కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టుకు పరిమితం అవుతుంటారు. ఇంకొంతమంది ఇండస్ట్రీలో .. పెట్టే నరక బాధను తట్టుకోలేక ఇండస్ట్రీకే దూరమైన వారు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో నాగశౌర్య తల్లి కూడా ఒకరిని చెప్పాలి.. ఇకపోతే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరో నాగ శౌర్య ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. చూడగానే పక్కింటి కుర్రాడిలా, లవర్ బాయ్ లా కనిపించే ఇతడు ఎంచుకునే పాత్రలు కూడా అలాగే ఉంటాయి. ముఖ్యంగా ఛలో సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైనా . ఇటీవల లక్ష్య సినిమా చేసి డిజాస్టర్ గా నిలిచాడు.
ఉషా మల్పూరి అలియాస్ నాగశౌర్య తల్లి మాట్లాడుతూ ఈ కథ మొదట మా అబ్బాయి విన్నాడు. చాలా బాగా నచ్చడంతో వెంటనే పాండమిక్ సమయంలోనే షూటింగ్ ప్రారంభించాము. ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. నాగశౌర్య పలురకాల భిన్న కోణాల్లో కనిపిస్తాడు.. తప్పకుండా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం నాకుంది. ఇకపోతే షూటింగ్ సమయంలో, రిలీజ్ సమయంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాము.. మేమే బలి పశువులం అయ్యాము. అన్ని కష్టాలు బయటకు చెప్పలేము కదా.. ఒకానొక సమయంలో ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోదాం అనిపించింది . కానీ కొంతమంది మిత్రులు మీరు చాలా మంచి సినిమా తీస్తున్నారు .మీ మీద చాలా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. మాకు ధైర్యం చెప్పారు..అని అన్నారు. ఇక ఫైనల్ అవుట్ పుట్ చూసుకుంటే మాకు చాలా సంతృప్తి అనిపించింది అంటూ ఉషా మల్పూరి భావోద్వేగానికి గురైయ్యారు.