తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన నాయిని నర్సింహా రెడ్డి టిఆర్ఎస్ పార్టీలో కీలక నాయకుడిగా ఎన్నో పదవులను అలంకరించిన విషయం తెలిసిందే, ఇటీవలే ఆరోగ్యం విషమించిన నాయిని నర్సింహారెడ్డి చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఇక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతగానో కృషిచేసిన నాయిని నర్సింహా రెడ్డి మృతితో తెలంగాణ రాష్ట్రం మొత్తం మూగబోయింది అని చెప్పాలి, ఇప్పటికీ ఆయన అభిమానులు ఆయన మృతి నుంచి తేరుకోలేక పోతున్నారు.
అయితే ఇటీవలే నాయిని నరసింహారెడ్డి గురించి పార్టీ నేత శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారి పోయాయి. టిఆర్ఎస్ పార్టీలో మాజీ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి కి తీరని అన్యాయం జరిగింది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవలే నాయిని నర్సింహారెడ్డి కుటుంబ సభ్యులను కలిసిన డి శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. తెలంగాణ పోరాటంలో ఎంతగానో కృషిచేసిన నాయిని నర్సింహా రెడ్డి టిఆర్ఎస్ పార్టీలో తగిన ప్రాధాన్యత దక్కలేదని.. ఆయన చివరి రోజుల్లో ఎంతో అసంతృప్తితో వున్నారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు శ్రీనివాస్ .