సీఎం జగన్ కి భారీ షాక్.. పాఠశాలలో మొదటిరోజే.. కరోనా కేసులు..!

కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చినప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా పలుమార్లు పాఠశాలలో ప్రారంభం వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలోని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. విద్యార్థులకు కరోనా వ్యాప్తి జరగకుండా ఉండేందుకు భౌతిక దూరంగా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేసింది.

అయితే మొదటి రోజే నెల్లూరులోని పాఠశాలలో కరోనా వైరస్ కేసులు బయటపడడం కలకలం సృష్టించింది. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నందవరం ఆదర్శ పాఠశాలలో మొదటి రోజు నాలుగు కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి రావడం ప్రస్తుతం ఆందోళనకరంగా మారిపోయింది. పాఠశాలలో కి విద్యార్థులు వచ్చే ముందే కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తుంది ప్రభుత్వం. ఈ క్రమంలోనే.. నెల్లూరులోని నందవరం ఆదర్శ పాఠశాలలు కరోనా నిర్థారిత పరీక్షలు చేయగా ఒక విద్యార్థి తో పాటు ముగ్గురు సిబ్బందికి పాజిటివ్ వచ్చింది. దీంతో వారిని వెనక్కి పంపించారు.